ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్.
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న సుమారు 17,514 మంది ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 7 నెలల పి ఆర్ సీ ఏరియర్స్ మరియు సెప్టెంబర్ నెల జీతం తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు వేతనము ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వేతనాలు మరియు 7 ఏరియర్స్ విడుదల చేయాలని , ఔట్సోర్సింగ్ ఏజెన్సీ విధానం రద్దు చేయాలని కాంట్రాక్టర్లు పీ.ఎఫ్. మరియు ఈ.ఎస్.ఐ. ఉద్యోగులకు సకాలంలో జమ చేయడం చేయడం లేదని కొంతమంది కాంట్రాక్టర్ల పై చర్య తీసుకోవాలని అవుట్సోర్సింగ్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసి ప్రత్యక్ష కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దుచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలు రాష్ట్రాలలో కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి కార్పొరేషన్ ద్వారా వేతనాలు చెల్లించాలనీ జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్వీములలో ముఖ్యంగా 104 ఉద్యోగులకు గత 4 నెలల నుంచి వేతనాలు లేవు, బస్తి దవఖాన ఉద్యోగులకు 5 నెలలుగా వేతనాలు అందంగా ఇబ్బంది పడుతున్నారు, తదితర అనేక పథకాలలో వేలాది మంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ
అత్యవసర సేవలు అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష మంది ఉద్యోగులు ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. మూడున్నర కోట్ల మందికి నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారు అలాంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాలని, 2014 లో వేతన సవరణ జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు అంటే గత 10 సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు, వెంటనే వేతన సవరణ చేసి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , హెల్త్ కార్డులు ఇవ్వాలి, ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


