N Ramachandra Rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపు ఇచ్చినటువంటి బీసీ జేఏసీ పిలుపునకు అన్ని పార్టీల సంపూర్ణ మద్దతును ప్రకటించడం అందులో భాగంగా

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్ర రావు కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బందులో పాల్గొని బందుకు పూర్తి సహకారాన్ని అందిస్తూ వ్యాపార సముదాయాలు కావచ్చు పాఠశాలలు కావచ్చు ఇతరత్రా సంపూర్ణంగా ఈ 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు పలకాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కుట్టిలతత్వాన్ని ఎప్పటికప్పుడు విషాన్ని కక్కుతూనే ఉంది బీసీలకు బద్ధ వ్యతిరేకైనటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు ఎప్పటికీ న్యాయం జరగదు అందుకు నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రిపై రెడ్డి సామాజిక వర్గం ఒత్తిడికి గురి చేయడమే కాకుండా అవమానానికి కూడా గురి చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ పై కూడా దళితులను వాడుకొని బీసీలపై మాట్లాడితే ఇదే విధంగా మేము మిమ్మల్ని వంచనకు గురిచేసి మంత్రి పదవి నుండి తప్పిస్తామని చెప్పకనే చెప్పి బెదిరించడం జరుగుతుంది.

ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు ఏ విధమైన న్యాయం జరగడానికి ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి రాబోయే జూబ్లీ సెలక్షన్లు కావచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్ల కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది బీసీలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి బీసీలకు నిజమైన న్యాయం కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే జరుగుతుంది అందుకు నిదర్శనమే కేంద్రంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు అదేవిధంగా అట్టడుగు వర్గానికి చెందినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది మురుమోను రాష్ట్రపతిని చేయడం జరిగింది గతంలో కూడా దళితులను రాష్ట్ర ప్రజలను చేయడం జరిగింది. ఈ పరిణామాలు అన్నిటిని గమనించి బీసీలకు న్యాయం చేయడం కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమైనంత నీ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

all parties have announced their full support for the BC JAC

You cannot copy content of this page

Scroll to Top