Suresh Naik : ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

TRINETHRAM NEWS

లేకుంటే నవంబర్ 17నుంచి మెరుపు సమ్మె

ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్ సురేష్ నాయక్

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే నవంబర్ 17 నుంచి మెరుపు సమ్మె చేపడతామని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్. సురేష్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్.హెచ్.ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగులందరికీ కొత్త జీవో 1195, 1187 ప్రకారం ప్రభుత్వం వెంటనే జీతభత్యాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. నవంబర్ 15 లోపు 2 నెలల వేతనాలు అనగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ విడుదల చేయాలని, లేనిపక్షంలో 17 తేదీన మెరుపు సమ్మె చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ఆయన హెచ్చరించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NHM employees' problems must be resolved

You cannot copy content of this page

Scroll to Top