పెద్దపల్లి, నవంబర్- 11 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గ్రామీణ నిరుద్యోగ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లా యూనియన్ బ్యాంక్ (రసేటి)వారి ఆధ్వర్యంలో రంగంపల్లి లో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి సంస్థ ద్వారా వివిధ కోర్సులలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు గ్రామీణ ప్రాంతాలలోని పేద యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం ద్వారా వారిని వ్యవస్థాపకులుగా, స్వయం ఉపాధి పొందేవారిగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ లక్ష్యం అని తెలిపారు టైలరింగ్ ,మగ్గం వర్క్ మొదలగు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని ఆసక్తి ఉన్న యువకులు దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ అపర్ణ రెడ్డి, రీసెట్ డైరెక్టర్ రాకేష్ ,లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


