NHM : మూడు నెలల పెండింగ్ వేతనాల విడుదల చేయాలని డి.ఎం.అండ్.హెచ్.ఓ. డాక్టర్.శ్రీరామ్ కు వినతి పత్రం అందజేసిన ఎన్ హెచ్ ఎం డీ.ఈ.ఓ.లు

TRINETHRAM NEWS

మెదక్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ ఆరోగ్య మిషన్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. శ్రీరామ్ కు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డాటా ఆపరేటర్ రాజశేఖర్ మాట్లాడుతూ… తక్షణమే ఉద్యోగులకు రావలసిన 3 నెలల వేతనాలు అనగా (సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్) తక్షణమే చెల్లించాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలని, డి ఈ ఓ లకు గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో జీవో 60 ను విడుదల చేశారు దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 1195 జీవో ప్రకారం 19500 రూపాయలు డి ఈ ఓ చెల్లించాలని అన్నారు.

ఉద్యోగులుకు ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 19 తేదీ లోపు మూడు నెలల వేతనాలు చెల్లించని లేని యెడల ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 20 డిసెంబర్ 2025 నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని ఉద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ (డి.పి.ఓ) కోట, డి.డి.ఎం. శ్రీలత, ఏపీడెమోలజిస్ట్ స్నేహ, డాటా ఎంట్రీ ఆపరేటర్లు దుర్గారాజ్ గౌడ్, రాజశేఖర్, మహేష్, ప్రశాంత్, సంగీత, విజేత ,మాధురి, మౌనిక మరియు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NHM DEOs submit petition to DM&HO

You cannot copy content of this page

Scroll to Top