Nadelli Rajeshwara Rao : ముస్త్యాల గ్రామ అభివృద్ధియే నా దేయం

TRINETHRAM NEWS

నడిపెల్లి రాజేశ్వరరావు

ముస్త్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ముస్త్యాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల జాబితాతో పాటు గ్రామ అభ్యున్నతిని అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా నడ్డిపెల్లి రాజేశ్వరరావు ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. ప్రజా సేవ పట్ల తనకున్న తపనతో, గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి సువాసన అందుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత చేయవలసిన ముందు పనులు ఊరు పోచమ్మని కొలిపించడం, గోదావరి నది ఒడ్డుకు పుష్కర ఘాటు నిర్మించడం, స్మశాన వాటిక సిసి రోడ్ వేపించడం, గ్రామంలో వీధి దీపాలతో పాటు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఇంకెన్నో అభివృద్ధి పనులు చేయడం కోసమే నేను ముందుకు వస్తున్నాను అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The development of Mustyala village is my wish

You cannot copy content of this page

Scroll to Top