New Rules on Driving License : తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

TRINETHRAM NEWS
New rules on driving license

New Rules on Driving License : త్రినేత్రం న్యూస్ : Mar 22, 2026, తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కఠినమవుతున్నాయి. ఇకపై లైసెన్స్ పొందాలంటే పాత రెండు పరీక్షలతో పాటు మరో అదనపు టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ రవాణాశాఖ ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ టెస్ట్‌లే ఉండగా, ఇకపై ముందుగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేయాలి. కాగా, ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top