MP Dr. Kadiyam : ధర్మసాగర్‌లో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్యా

TRINETHRAM NEWS
MP Dr. Kadiyam Kavya inaugurated a free mega medical camp

MP Dr. Kadiyam : ధర్మసాగర్, మార్చి 22 త్రినేత్రం న్యూస్… హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో, ధర్మసాగర్ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఎలియా ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యా ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు తమ ఆరోగ్య పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలని కోరారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
కూరపాటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రోగులకు సూచనలు అందించారు సుస్మితా డెంటల్ వారిచే దంత పరీక్షలు నిర్వహించి, నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు వాసన్ ఐ కేర్ హాస్పిటల్ బృందం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్సల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కూరపాటి ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్య బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండానే నేరుగా వచ్చి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడంతో సామాన్య ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top