RBI : త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది.

మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. శక్తికాంత దాస్ పదవీ విరమణ చేసిన అనంతరం సంజయ్ మల్హొత్రా ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు.

అంతకు ముందు శక్తికాంత దాస్ పదవీ కాలం పొడిగించబడింది. అనంతరం సంజయ్ మల్హొత్రా 26వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ మల్హొత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన 3 సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. గతంలో రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది. పాత రూ.1000 నోటను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

త్వరలో రూ.50 నోట్ల కూడా..

కొత్త రూ.50 నోటును విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకం కూడా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. కొత్త సిరీస్ లోని మహాత్మ గాంధీ చిత్రం కూడా ఈ నోట్లపై ముద్రించబడుతుంది. ఈ నోటుపై కొత్త భద్రతా లక్షణాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా నోటును కాపీ చేయడం కష్టమవుతుంది. దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New notes coming soon

You cannot copy content of this page

Scroll to Top