
శాసనసభ్యులు : నేనావత్ బాలు నాయక్ .
Nenavath Balu Naik : చందంపేట మే 15, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల కేంద్రానికి చెందిన ఎలిజెర్ల కళమ్మ – శ్రీనయ్య నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో శాసనసభ్యులు. నేన్నావత్ బాలు నాయక్ పాల్గొని, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి,ఇంటి యజమానికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఆత్మగౌరవం పెరిగిందని, నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఎంతో ఆనందదాయకమని , ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, వారి చేతుల స్పర్శలో కనిపించిన స్వచ్ఛమైన ప్రేమ తనను ఎంతో మంత్ర ముగ్ధుడిని చేసిందన్నారు. గుమ్మానికి కట్టిన మామిడాకుల తోరణంలో పేద కుటుంబాల ఆత్మగౌరవం ప్రతిబింబించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బద్య నాయక్,స్థానిక సర్పంచ్ సాధిక్, మాజీ ఎంపీపీ గోవింద్ యాదవ్, బిక్కు నాయక్, ఎంపిడిఓ లక్ష్మీ, హౌసింగ్ DE, యుజవన కాంగ్రెస్ నాయకులు కిన్నెర హరికృష్ణ, సర్పంచ్ శంకర్ రావు,జిల్లా నాయకులు మల్లా రెడ్డి, మహాలక్ష్మయ్య,గిరి, మున్నయ్య, రంగయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు వంశీ అయ్యగారు, ఎడ్ల గిరి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

