MLA Nenavat Balu Naik : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ

TRINETHRAM NEWS

రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఎక్కడా ఉండకూడదు అన్నది ప్రజా ప్రభుత్వ ధ్యేయం…

ప్రతి పేదవాడి ఇంటి కలను నెరవేర్చాలన్నదే మా సంకల్పం..

పేదవాడి ఇంటి కల నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో ₹22,500 కోట్లు కేటాయించిన ప్రజా ప్రభుత్వం.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని తెలుగుపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ. ఎం ఎల్ ఏ బాలు నాయక్ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గత పాలకులు పేదల ఇంటి కలను నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రజల ఆకాంక్షలను గుర్తించి, ఈ రోజు మా ప్రజా ప్రభుత్వం ఆ కలను సాకారం చేస్తోంది అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని కోటి పది లక్షల కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించగలగడం మాకు గర్వకారణం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కేవలం మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ఓ రికార్డు. ప్రతి పేద కుటుంబానికి ఇంటి కల నెరవేర్చేలా మొదటి దశలోనే నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం అని అన్నారు.

పేద కుటుంబానికి రేషన్ బియ్యం, రూ.500 గ్యాస్, ఉచిత విద్యుత్, పెన్షన్లు, ఉపాధి హామీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు… ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం అని అన్నారు. ఇవన్నీ రాష్ట్రంలో సమాజసమానత కోసం మేము తీసుకుంటున్న చర్యలు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అవసరాలే ప్రభుత్వ విధానాలుగా మారుతున్నాయి. ఒక మనసున్న ప్రభుత్వం ఎలా ఉండాలో మా ప్రభుత్వం స్పష్టంగా చాటి చూపుతోంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు,మాజీ ఎంపీటీసీలు, NSUI నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Indiramma's house construction ground

You cannot copy content of this page

Scroll to Top