జూలై 11, 2026
TRINETHRAM NEWS
Nenavat Balu Naik

నేనావత్ బాలు నాయక్ శాసనసభ్యులు.

Nenavat Balu Naik : దేవరకొండ డివిజన్ మే 14, త్రినేత్రం న్యూస్. దేవరకొండ. పట్టణలోని 3వ వార్డులో NH167 నుండి గాజీనగర్ BT రోడ్డు వరకు నగరాభివృద్ధి నిధుల నుండి 120.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ శంఖు స్థాపన చేసారు.

అనంతరం దేవరకొండ పట్టణంలో బాష్పక సుమలత – విజయ్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇంటి యాజమానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని , సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం లేకుండా అధికారులు పరిశీలించాలని, లోపం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆడబిడ్డలు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరుస్తుందనీ మహిళ సాధికారత పెరిగితే తెలంగాణ ప్రగతి మరింత వేగంగా పరుగులు తీస్తుంది అని, కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page