ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Negligence

సమాచార అధికారి (PIO)కి ₹2,000 జరిమానా

Negligence : దేవరకొండ డివిజన్ జులై 29, త్రినేత్రం న్యూస్. సమాచార హక్కు చట్టం-2005 (RTI) కింద కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించకుండా నిర్లక్ష్యం వహించినందుకు నల్గొండ జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) పై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం (29-07-2026) హైదరాబాద్ మోజంజాహి మార్కెట్‌లోని సమాచార హక్కు భవన్‌లో గల కోర్ట్ హాల్‌-2 లో జరిగిన విచారణకు అప్పీలుదారు, RTI SS (రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ) జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కె. బాబూరామ్ నాయక్ హాజరయ్యారు. అప్పీల్ సంఖ్య 10301/SIC-MP/2026 కు సంబంధించిన ఈ కేసును విచారించిన రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి మోహ్సినా పర్వీన్ (Smt. Mohsina Parveen), బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
​సమాచార చట్టం ప్రకారం చట్టబద్ధమైన గడువు దాటినా దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వకపోవడంతో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు కమిషనర్ శ్రీమతి మోహ్సినా పర్వీన్ రూ. 2,000 జరిమానా విధించారు. ఈ జరిమానా మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లించడంతో పాటు, అప్పీలుదారు కోరిన పూర్తి సమాచారాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా కచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు. ఇచ్చిన వారం రోజుల గడువులోగా పూర్తి స్థాయి సమాచారం అందించకపోతే మళ్లీ పెనాల్టీ విధించడంతో పాటు తీవ్రమైన శాఖాపరమైన డిసిప్లినరీ చర్యలు (Departmental Action) తీసుకుంటామని హెచ్చరించారు.
​ఈ సందర్భంగా RTI SS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కె. బాబూరామ్ నాయక్ వ్యాఖ్యానిస్తూ, ప్రజా సంక్షేమం మరియు ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం RTI SS తరఫున కోరిన సమాచారాన్ని అధికారులు తొక్కిపెట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. కమిషన్ జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరికి చెంపపెట్టు అని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వారం రోజుల్లో పూర్తి సమాచారాన్ని అందించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం తదుపరి చర్యలకు శ్రీకారం చుడతామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page