
Guru Purnima Celebrations : డిండి (గుండ్ల పల్లి) జూలై 29,త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలను నిర్వహించారు.తెల్లవారుజామున సుప్రభాత సేవ సేవతో మొదలైన కార్యక్రమాలు నగర సంకీర్తన ,సామూహిక అభిషేకాలు నిర్వహించారు.
రుద్ర నమక, చమక వేద పారాయణంతో పంచామృతములతో శిరిడీ సాయినాధునికి సామూహికంగా అభిషేకం, అష్టోత్తరం, భజన కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శిరిడీ సాయినాధుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.మధ్యాహ్నము నారాయణ సేవా కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని భోజన ప్రసాదములు స్వీకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe