సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Tributes Paid Advocate Jhansirani

టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ;— డాక్టర్ యేకుల రాజారావు.

Tributes Paid Advocate Jhansirani : దేవరకొండ డివిజన్ ఆగష్టు 23, త్రినేత్రం న్యూస్. యువ న్యాయవాది గోకమళ్ళ ఝాన్సీ రాణి శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయంలో తెలుసుకొని టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు న్యాయవాది ఝాన్సీ రాణి మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటివల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యను పూర్తి చేసి, హైదరాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయవాది వద్ద జూనియర్ న్యాయవాది గా పనిచేస్తున్నారు.

హైదరాబాద్ కోఠీలో ఆర్టీసీ బస్సు ఝాన్సీ రాణి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీ కోట్టడంతో అక్కడికీ అక్కడే మరణించటం చాలా బాధాకరం అన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య ను అభ్యసించి, తల్లిదండ్రులకు అండగా చేతికి వచ్చిన బిడ్డ తమ కళ్ళ ముందే విగిత జీవిగా మారడంతో, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూంటే వారిని ఓదార్చి దైర్యం చేప్పారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన వెంట అడ్వకేట్ నూనె సురేష్, మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమోళి, కార్యదర్శి మేడ సైదులు,ఎర్ర వెంకటయ్య,చేపూరి మురళి, నూనె జనార్దన్ తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page