ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
AIYF Demand

ఏఐవైఎఫ్ డిమాండ్.

AIYF Demand : డిండి (గుండ్ల పల్లి) జులై 29, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని రహమంతపూర్ మరియు చెరుకుపల్లి గ్రామాలలో అఖిల భారత యువజన సమాఖ్య నూతన కమిటీ లను ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడారు ..ఆనాటి నుండి ఈనాటి వరకు అలుపెరగని పోరాటాలు చేస్తూ యువతకు ఒక ఆదర్శ సంఘంగా నిలిచి క్రియాశీలక పాత్రలు పోషిస్తున్న ఏకైక సంఘం అఖిల భారత యువజన సమాఖ్య అని, పాలకులు వస్తున్నారు పోతున్నారు డిండి మండలాన్ని గాలికి వదిలేశారు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల,మోడల్ స్కూల్,ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ఉన్నప్పటికీ వారికి కళాశాల వసతి గృహాలు లేక ప్రతిరోజు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఐటిఐ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఇతర జిల్లా వాళ్ళు ఉన్నారు వారు ఉండడానికి హాస్టల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంటర్ విద్యార్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది వెంటనే డిండి మండలానికి కళాశాల వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య పక్షాన డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు.
ఈ సమావేశాల్లో రహమంతపూర్ అఖిలభారత యువజన సమాఖ్య నూతన కమిటీ అధ్యక్షులుగా నక్క వెంకటేష్,కార్యదర్శిగా పెంటమల్ల వెంకటేష్,ఉపాధ్యక్షులుగా సీమర్ల ఆంజనేయులు,సహాయ కార్యదర్శిగా బోయ అన్వేష్,కోశాధికారిగా ఎండి రియాజ్ మరియు చెరుకుపల్లి నూతన కమిటీ అధ్యక్షులుగా ఎల్తూరి నాగార్జున్,కార్యదర్శిగా డేగ అనిల్,కోశాధికారిగా నూతనగంటి ఆంజనేయులు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page