Tribal Welfare Association : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు మరియు ఉపాధి హామీ పథకాలలో విస్తృత అవినీతి

TRINETHRAM NEWS

స్వతంత్ర విచారణకు గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ .

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 27 త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని నేరేడుగోమ్ము మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబు రామ్ నాయక్ ఫిర్యాదు పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు మరియు ఉపాధి హామీ పథకాల అమలులో తీవ్ర అవకతవకలు జరిగాయని రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా అర్హులైన గిరిజనులు, పేదలు, నిరుపేద కుటుంబాలను పూర్తిగా పక్కన పెట్టి, నకిలీ లబ్ధిదారుల పేర్లతో కేటాయింపులు జరుగుతున్నాయి. తప్పుడు కమిటీలు, ఫోర్జ్డడ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఇళ్లు కేటాయించడం వంటి అవినీతి చర్యలు పెద్దఎత్తున చోటు చేసుకున్నాయి,” అని పేర్కొన్నారు.అలాగే ఆయన స్పష్టంగా తెలిపారు
“ఉపాధి హామీ పథకం(ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్) లో కూడా విస్తృత అవినీతి వెలుగులోకి వచ్చింది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు మాస్టర్లు జాబ్ కార్డులేని వ్యక్తుల పేర్లతో తప్పుడు బిల్లులు తీసుకోవడం, నిజంగా పని చేసిన కార్మికులకు చెల్లింపులు జరగకపోవడం, పాత పనులను కొత్తగా చూపించి డబుల్ బిల్లులు వేయడం వంటి మోసపూరిత చర్యలు చేస్తున్నారు. ఇది పేదల హక్కులను దోపిడీ చేయడం వంటిదే,” అని తీవ్రంగా విమర్శించారు. ఫేక్ కమిటీలను వెంటనే రద్దు చేయాలి. డూప్లికేట్ / ఫోర్జుడు ఆలోకేషన్స్ ను రద్దు చేయాలి.ఉపాధి హామీ బిల్లులు, రసీదులు, ఫీల్డ్ వెరిఫికేషన్ నివేదికలు, ఇళ్ల కేటాయింపులు అన్నీ స్వతంత్ర విచారణకు లోబరచాలి.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలనీ ఆయన డిమాండ్ చేశారు.
“ఈ అవినీతి చర్యలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగితే గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందనీ న్యాయం జరిగే వరకు మేము వెనక్కి తగ్గము,” అని స్పష్టం చేశారు.చివరగా ఆయన సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Widespread corruption in Indiramma's house

You cannot copy content of this page

Scroll to Top