ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Naa Pattu - Naa Abhimanam

Naa Pattu – Naa Abhimanam : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. (త్రినేత్రం న్యూస్) ఆగస్టు23. పెనుమూరు: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గంగుపల్లెలో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో ‘నా పట్టు.. నా అభిమానం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పట్టు పురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి శ్రీమతి వాణి, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త శ్రీమతి తంగరోజా, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి గీత, సెరికల్చర్ ఆఫీసర్ శ్రీమతి వెంకటలక్ష్మి, పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది, మండలంలోని పట్టు రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పట్టు పురుగుల పెంపకం, మల్బరీ తోటల నిర్వహణలో ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు రైతులకు వివరించారు. పట్టు పురుగుల పెంపకం, గదులను శుభ్రం చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించారు. రైతులకు రాయితీపై ఫేస్ మాస్కులు అందజేస్తామని తెలిపారు.
నాణ్యమైన మల్బరీ ఆకుల దిగుబడి కోసం పోషకాలను పిచికారీ చేసే విధానాన్ని రైతుల సమక్షంలో ప్రదర్శించి అవగాహన కల్పించారు. నాణ్యమైన మల్బరీ ఆకులను పట్టు పురుగులకు అందించడం ద్వారా నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. పట్టుగూళ్ల మార్కెట్‌లో గూళ్లను విక్రయించే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాణ్యతకు అనుగుణంగా ధర పొందే విధానంపై కూడా సూచనలు అందించారు.
సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త తంగరోజా మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మల్బరీ పంటకు వేరుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉందని, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఆధునిక సాగు పద్ధతులను పాటించి నాణ్యమైన మల్బరీ ఆకులు, పట్టుగూళ్ల ఉత్పత్తిని పెంచుకోవాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page