WhatsApp Image 2023 12 28 at 4.15.01 PM
Achechennaidu : హామీల అమలులో నిర్లక్ష్యం..జగన్ రెడ్డిపై అచ్చెన్న ఆగ్రహం
అమరావతి – ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యాడంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు 730 హామీలు ఇచ్చారని , ఇందులో కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడని ఆరోపించారు.
నాలుగున్నర ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ధ్వజమెత్తారు. ఎక్కడైనా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆదుకున్నారా అంటూ నిలదీశారు.
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. వై నాట్ 175 సీట్లు అనేవి ఉట్టిమాట అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన తో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని చెప్పారు.
ప్రజలు ఇప్పటికే జగన్ రెడ్డిని భరించే స్థితిలో లేరన్నారు. తాము అధికారం లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తమకు ఈసారి కనీసం 130 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు అచ్చెన్నాయుడు. జగన్ కలలు కంటున్నారని ఆయన పవర్ లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
