సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Need Better Medical Services

Need Better Medical Services : డుంబ్రిగూడ, సెప్టెంబర్ 18, (త్రినేత్రం న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు పాల్గొని వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలతో పాటు ఆరోగ్యంపై నిరంతర అవగాహన కల్పించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజా సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కిల్లోగూడ పరిసర గ్రామాల ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వంతల దేవదాసు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ కిరణ్, కిల్లోగూడ వైద్యాధికారి డాక్టర్ రత్నం, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page