అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Vehicle Checks

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: సీఐ కోటేశ్వరరావు

Vehicle Checks : అరకులోయ సెప్టెంబర్ 18, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు అరకు వేలి మండల పరిధిలోని చొంపి జంక్షన్ వద్ద అరకు సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, క్యాట్ ఐస్, సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ఫ్లెక్సీలు, స్టాప్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రికార్డులు లేని వాహనాలపై ట్రాఫిక్ కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం, ఓవర్‌స్పీడ్, రేస్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్‌లోడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page