అక్టోబర్ 10, 2026
TRINETHRAM NEWS
Kanchi Mahender

Kanchi Mahender : కూకట్పల్లి సెప్టెంబర్ 17 త్రినేత్రం న్యూస్ : ఫతేనగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫతేనగర్ బ్రిడ్జి రహదారి వద్ద, మాధవి నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాలను బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
అదే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫతేనగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో కాంచి మహేందర్ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత కాలం దేశానికి సేవలందించాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నసీర్, బాలేష్, సురేష్, అశోక్, శివ, అరవింద్, రవి, రాధేశ్యామ్, ఉష, సునీత, లక్ష్మి, రఘు, వినీత్, కమల్, రాజు, బాలరాజ్, శ్రీనివాస్, గోపాల్, బన్నీ తదితర ఫతేనగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page