MLA Satyananda Rao : యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి

TRINETHRAM NEWS

స్కిల్ ఇండియా శిక్షణా ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు

కొత్తపేట:త్రినేత్రం న్యూస్ : యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు,ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కిల్ ఇండియా సౌజన్యంతో రావులపాలెం బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్,ఎంపీ హరీష్ మదూర్ లతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణా ధ్రువ పత్రాలను మరియు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.వివిధ పథకాల ద్వారా యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు సంజీవ్,ఆకుల రామకృష్ణ,కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NDA government is working

You cannot copy content of this page

Scroll to Top