వరంగల్ జిల్లా మే-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించ తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా పడినట్లు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యాటకుల పై ఉగ్రవాదుల దాడి అనంతరం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 20వ తేదీన హైదరాబాద్ ఇందిర పార్క్ లో ధర్నాను వాయిదా పడిందని మళ్లీ తిరిగి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను 2025 జులై 09 కి వాయిదా వేయడం జరిగిందని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్ణయించినట్లు రామ రాజేష్ ఖన్నా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులందరూ గమనించాలని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


