హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 08 ఏప్రిల్ 2025. నేషనల్ హెల్త్ మిషన్ లో 17541 ఉద్యోగులందరికీ రావాల్సిన 7 నెలల పీ.ఆర్.సీ. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఎన్. హెచ్.ఎం కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు అనగా 7 నెలలు ఏరియర్స్ చెల్లించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు.
నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు సమయానికి అందకపోయినా ప్రజాసేవలో ముందుగా నిలిచి సేవలు అందిస్తున్నామని మరి అలాంటి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ఏడు నెలల ఏరియర్స్ విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్ హెచ్ ఎం కాంటాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యాక్ట్ 1994 చట్టం ప్రకారం ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 లోపు ఉన్న ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


