Solve the Problems : రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించండి

TRINETHRAM NEWS

కమీషనర్ కు వినతి పత్రం ఇచ్చిన నాయకులు.

రామగుండం మే-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న రిక్షా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ ఇంచార్జీ కమీషనర్ కు ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్, నగర సమితి కార్యదర్శి ఎం.ఎ.గౌస్ , ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ లు కలిసి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 50డివిజన్లకు 50ట్రాలీలు ఉన్నాయని , 50డివిజన్లలో ఇంటింటికి తడి చెత్త, పొడి చెత్త సేకరించి ట్రాలీలలో వేసుకుని డంపు యార్డుకు తీసుకవెళ్లే కార్మికులను, ఈ మధ్యకాలంలో డివిజన్లో లోని చెత్త ఎత్తడం, వార్డులు ఊడ్చడం చేయాలని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారని, కానీ అధికారులు చెప్పిన విధంగా రిక్షా కార్మికులు పనిచేయగలరని, గతంలో 50 డివిజన్లకు 202మంది కలిగి ఉన్నారని,ఇప్పుడు 136 మంది ఉన్నారని, దీని వలన అధికారులు చెప్పిన విధంగా పనులు చేయలేకపోతున్నారని వారు పేర్కొన్నారు.

ఈ తరుణంలో రిక్షా కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మార్పిడి చేస్తే అధికారులు చెప్పిన విధంగా ట్రాలీలో చెత్త వేయడం, ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరించడం, వార్డులు ఊడ్చేవారు తక్కువగా ఉన్నా, ట్రాక్టర్ పైన కార్మికులు తక్కువగా ఉన్నా వారితో కలిసి పనులు చేయగలరని వారు తెలిపారు.రిక్షా కార్మికులను ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ కోసం నియమించుకుని, అందుకు భిన్నంగా పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. వెంటనే ఆ పనిని నిలిపివేసి తడి, పొడి చెత్త సేకరణ కోసం మాత్రమే వారిని నియమించాలి.

లేదా పారిశుధ్య పనులు చేయించినచో వారికి కాంట్రాక్టు కార్మికుల వేతనం ఇవ్వాలని , పని ముట్లు, బట్టలు, చెప్పులు, రెయిస్ కోట్లు, నూనె, బెల్లం, యూనిఫాం, యూనిఫాం కుట్టు కూలీ వెంటనే ఇవ్వడంతో పాటు ఇక ముందు క్రమం తప్పకుండా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రామగుండం కార్పొరేషన్లో జనాభా పెరిగి పారిశుధ్య నిర్వహణ ప్రాంతాలు పెరగడం వలన పారిశుధ్య నిర్వహణ కొంత కుంటుపడుతున్నందున నూతన కార్మికులను నియమించాలని, అదేవిధంగా ఆకారణంగా తొలగించిన సూపర్వైజర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కమీషనర్ ను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Solve the problems of

You cannot copy content of this page

Scroll to Top