National Energy Conservation Day : ఆర్ ఎస్ ఆర్ లో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. బోగోలు మండలం : కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను ఘనంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి .వి .ఎన్. రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల యొక్క ఐఐసీ మరియు ఈ ఈ ఈ విభాగంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందనీ , ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ కె. రాజా రెడ్డి , ఐ.ఐ.సీ. ఉపాధ్యక్షులు డాక్టర్ పి. బృందావని మరియు ఈఈఈ హెచ్ ఓ డి డాక్టర్ వి. రవీంద్ర రెడ్డి వక్తలుగా పాల్గొన్నారు అని తెలిపారు.

వక్తలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు శక్తిని ఎలా ఆదా చేయాలో అవగాహన పెంచూతూ ఇంధన ఆదా అలవాట్లు మరియు పద్ధతులపై కూడా వారు నొక్కి చెప్పారు. అలాగే శక్తిని వృధా చేయకూడదని మరియు తెలివిగా ఉపయోగించాలని కూడా వారు ముగించారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఈ విభాగ అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Energy Conservation Day in RSR

You cannot copy content of this page

Scroll to Top