TRINETHRAM NEWS

అంతర్జాతీయ కాఫీ రేట్లకు అనుగుణంగ జీసీసీ కాఫీ కొనుగోలు చేయాలి. జాతీయ కాఫి సంఘం చిన్నబాబు డిమాండ్.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 25 :

అరకు వేలి సుంకర మెట్టలో
జాతీయ కాఫీ రైతు సంఘం నాయకులు గెమ్మెల చిన్న బాబు పర్యటించి రైతులతో మాట్లాడుతూ ఏజెన్సీలో పండించే ఆర్గానిక్ కాఫీకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని ఆ రేటు కష్టపడి మొక్కలు నాటి పంట పండించే రైతులకు అందటం లేదు మొన్న జీసీసీ ప్రకటించిన కిలో పార్సిమెంట్ కాఫీ 320 రైతులకు ఏ మాత్రం సరిపోదు.కిలో కాఫీ 500 రూపాయలకు కొనుగోలు చేయాలని జీసీసీ ప్రకటించాలి. పళ్ళు కిల్లో 100 చెర్రీ 280 రూపాయలకు మద్దత్తు ధర ప్రకటించాలి. కాఫీ రైతులకు పెట్టు బడి ఖర్చులు విపరీతంగా పెరగడం వలన జీసీసీ ప్రకటించిన ప్రస్తుత రేట్లు వలన రైతులు పెట్టు బడి పెట్టిన ఖర్చులు కూడ వచ్చే పరిస్థితి లేదు. ఒక వైపు ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గంజాయి నిర్ములన కోసం ప్రత్యమ్యాయ పంటలు పండించాలి అంటూనే కాఫీ పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించక పోతే ఏ విదంగా రైతులను ప్రత్యమ్యాయ పంటల వైపు రాగలరని,అంతర్జాతీయ మార్కెట్ లో అరకు కాఫీకు మంచి డిమాండ్ ఉన్న ప్రభుత్వ సంస్థ అయిన జీసీసీ అతి తక్కువ రేట్లు ప్రకటించడంతో రైతుల నుండి అతి తక్కువ రేట్లకు దళారులు ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. అలాగే కాఫీ పళ్ళు కోత సమయంలో జిల్లాలో కురిసిన అకాల వర్షలకు ఈ సంవత్సరం కాఫీ పంట మొత్తం నేల పాలవడం వలన రైతులు తీవ్ర నష్ట పోయారు ప్రభుత్వం కాఫీ రైతులకు ఎకరకు లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాఫీ రైతులు కొర్ర చిట్టి బాబు, గెమ్మెల లక్ష్మణ్, కొర్ర సింహాచలం, పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App