డిండి(గుండ్ల పల్లి) జులై 25 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నల్లగొండ జిల్లా పరిపాలనధికారి (కలెక్టర్ ) ఇలా త్రిపాఠి విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. డీలర్లందరూ ఈ-పాస్ (ఆధార్ ఆధారిత) పద్ధతి ద్వారానే అమ్మకాలు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి రమణారెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్, అదనపు కార్యక్రమం అధికారి జయరాజు, వ్యవసాయ అధికారి రెహానా తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


