డిండి (గుండ్ల పల్లి) జూలై 05 త్రినేత్రం న్యూస్. విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్నిరకాల వసతులు (సదుపాయాలు)ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలకేంద్రంలో సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలను సందర్శించారు.ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న గురుకులాలు , రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలలు విద్యాసంస్థలు, కేజీవీబీలలో విద్యార్థులకు అన్ని రకాలుగామౌలిక వసతులు వుండాలని అన్నారు.
డిండి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాలఉన్నా సమస్యలగురించి ప్రిన్సిపాల్ శిరీష ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో డ్రేనేజ్,వాటర్ పైప్ లైన్ సమస్యావుందని దీనిగురించి ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక అందించామని, కోతుల బెడద చాలవుందని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనిప్రిన్సిపాల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్ డీ ఓ రమణారెడ్డి, రెసి డెన్సియల్ పాఠశాలల జోనల్ అధికారి విధ్యరాణి,మండల విద్యాధికారి గొప్యనాయక్ తదితరులున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


