జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ ను తన కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కలవడం జరిగింది.ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా వారు చేస్తున్న ఉద్యమం గురించి వారికి జరుగుతున్న అన్యాయం గురించి రాజేందర్ గౌడ్ కు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ కులవృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిధి అధికారులదే అని స్పష్టంగా చెప్పడం జరిగింది.అదేవిధంగా తాము చేసే ఉద్యమానికి మద్దతుగా నిలుస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

అంతరించిపోతున్న ఈ బీసీ కులాల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది అని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు చెబుతున్న ఉద్యమానికి బీసీ సంఘాలన్నీ కూడా మద్దతుగా రావాలని చెప్పి కోరడం జరిగింది.అదేవిధంగా దానికి తగిన కృషిని తన వంతుగా తాను చేస్తానని కూడా చెప్పడం జరిగింది.వెంటనే స్పీకర్ ప్రభుత్వంలోని పెద్దలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కమిషనర్ అందరు కూడా స్పందించి న్యాయం జరపాలని డిమాండ్ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nai Brahmin Mangali Sangam

You cannot copy content of this page