వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మరియు ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించి నమోదైన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటువంటి నేరాలకు పాల్పడే వారిపై ఎటువంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరస్థుల నేర చరిత్రను పూర్తిగా పరిశీలించి, అవసరమైతే వారిపై రౌడీ షీట్‌లు తెరవాలని, పీడీ యాక్ట్ ప్రెవేన్షన్ అఫ్ డేంజరస్ ఆక్టివిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడానికి తగిన రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. సమాజంలో మహిళలు, బాలికలకు పూర్తి భద్రత కల్పించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలన కొరకు కష్టపడి పని చేయాలని తెలిపినారు.పెండింగ్ కేసుల పరిష్కారం: పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
నాన్-బెయిలబుల్ వారెంట్లు NBWలు మరియు పాత నేరస్థులు: జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచి వారిని నియంత్రించాలని స్పష్టం చేశారు. గ్రామాలపై అవగాహన మరియు అప్రమత్తత: ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు గల కారణాలను గుర్తించి, వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్న హాట్‌స్పాట్‌లను గుర్తించి, ఆ ప్రాంతాలలో నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి కళాజాత బృందాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణ: ఇసుక అక్రమ రవాణా, గుట్కా విక్రయాలు, మరియు పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం బియ్యం అక్రమ నిల్వలు, రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
సీసీటీవీల ప్రాముఖ్యత: నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర చాలా కీలకమని, ప్రజలలో సీసీటీవీల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని, వాటిప్రాముఖ్యతను వివరించాలని కోరారు. వారాంతపు తనిఖీలు: వారాంతపు రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఓపెన్ డ్రింకింగ్ నివారణ, మరియు వాహనాల తనిఖీలను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఇ-పెట్టీ కేసులు మరియు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్: ఇ-పెట్టీ కేసులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్‌ను సమర్థవంతంగా వినియోగించుకొని కేసుల కన్విక్షన్ నేరం రుజువు శాతాన్ని పెంచాలని ఎస్పీ తెలిపినారు. పోలీస్ స్టేషన్లలోని ప్రతి ఫంక్షనల్ వర్టికల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ టివి హనుమంత్ రావు ,జిల్లాలోని డిఎస్‌పి అధికారులు, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


