Y-shaped bridge : వరంగల్ వై ఆకారం బ్రిడ్జిని తక్షణమే మరమ్మత్ చేయాలి ముక్కెర రామస్వామి డిమాండ్

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా.. 16 ఆగస్టు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఎంసిపిఐయు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న వై ఆకారం బ్రిడ్జిని నాయకులు కార్యకర్తలు సందర్శించడం జరిగింది. ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… వరంగల్ వై ఆకారం బ్రిడ్జి 10 సంవత్సరాలు నిండాక ముందే బ్రిడ్జి శిథిలావస్థలో మారిందన్నారు బ్రిడ్జి మొత్తం గుంతలు బడి సలాకు కంకర తేలి ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు రాత్రిపూట వీధిలైట్లు లేక ప్రతిరోజు వేలాదిమంది టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ నడుపుతున్న వాహనదారులు గుంతలలో పడి కాళ్లు చేతులు విరిగి హాస్పటల్ పాలవుతున్నారు అన్నారు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసి బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టర్లు నాణ్యతలేని ఐరన్ సిమెంటు తదితర సామాగ్రిని వాడడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు ఇట్టి విషయంలో అనేకసార్లు ధర్నాలు చేసిన ఆర్ అండ్ బి అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్ర పట్టించుకోవడం లేదన్నారు తక్షణమే బ్రిడ్జిని మరమ్మతులు చేసి ప్రజలకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగ్గని మల్లికార్జున్ నగర్ ,కమిటీ సభ్యులు బావు ,రామస్వామి, శివ, హమాలి సంఘం నాయకులు అడప యాదగిరి, బిక్షపతి రాజ్ కుమార్ ,గట్టయ్య ,గుమాస్తా సంఘం నాయకులు రాజేందర్ మనోరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Warangal Y-shaped bridge

You cannot copy content of this page

Scroll to Top