MRPS : జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ సభలు పండుగలా జరపబోతున్నాం

TRINETHRAM NEWS

ఈ నెల 19వ తేదీన వి.హెచ్.పి,ఎస్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు హైదరాబాదులో ఘన సన్మానం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం, జూన్ 12 : జూలై 7వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవం, ఎమ్మార్పీఎస్ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరుగుతాయని తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి బయ్యరపు రాజేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి వైరాల అప్పారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాల దీర్ఘకాలంగా ఎస్సీ రిజర్వేషన్ కొరకు పోరాటం జరిగిందని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంతో పాటు సమాజంలో ఉన్న వివిధ సమస్యలు ఆరోగ్యశ్రీ వృద్ధుల వికలాంగుల పెన్షన్ రేషన్ బియ్యం కోటా పెంపు దళితుల హత్యలు అత్యాచారాల మీద పోరాటం చేయడం జరిగిందని తెలిపారు ఎమ్మార్పీఎస్ భవిష్యత్ కార్యక్రమం లో భాగంగా ఈ దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అసమానతల మీద పోరాటం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు దీనికి ఎంఆర్పిఎస్ నాకేస్తున్నాం ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరించారు దీనిలో భాగంగా జూలై 7వ తేదీన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ సభలు ఉభయ రాష్ట్రాలలో గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ స్తూపాలు ఏర్పాటు చేసి జండా ఆవిష్కరణలు జరుగుతాయని తెలిపారు.

ఈ సందర్భంగా నెల రోజులు కార్యచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి.హెచ్.పి.ఎస్) ఆధ్వర్యంలో జూన్ 19వ తేదీన హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సన్మాన సభకు పెద్ద ఎత్తున వికలాంగులు, ఎమ్మార్పీఎస్ ,ఎంఈఎస్, ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు మహిళలు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు గేడ్డం వినోద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు యందం గోవింద రాజులు మాదిగ, ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి గాంధీ, మాదిగ,వి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు భీమడోలు కిరణ్ కుమార్,ఎమ్మార్పీఎస్ నాయకులు వైరాల రమేష్ మాదిగ, వెంకన్న మాదిగ, పెదపూడి ఎల్లారావు మాదిగ, గడ్డం వెంకటేశ్వరరావు మాదిగ, పోసుపో నాని మాదిగ, కొమ్ముకూరి వీరబాబు మాదిగ, ఉప్పాడ అప్పారావు మాదిగ, రామారావు, వెంకటేశ్వరరావు మాదిగ, గాలింకి రాము మాదిగ, రాచర్ల సుధాకర్ మాదిగ, టీ.వీ రాజు మాదిగ, విహెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎమ్మెస్ పి నాయకులు కత్తి సోమరాజు, స్వర్ణలత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MRPS 31st foundation meeting

You cannot copy content of this page

Scroll to Top