Free Medical Camp : ఉచిత మెడికల్ క్యాంపు

TRINETHRAM NEWS

తేదీ : 11/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మండలం, కొమ్మిరెడ్డిపల్లి గ్రామం లో దొడ్డ.అంజయ్య సుధా మెమోరియల్ ఉచిత మెడికల్ క్యాంపును టిడిపి సీనియర్ నేతలు చెరుకూరి. రాజేశ్వరరావు, రేగళ్ల. వీరారెడ్డి, తాళ్లూరి .రామారావు, కిల్లారు. రమేష్, గద్దె. వెంకన్న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. దొడ్డ .మాధవరావు ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది.

విజయవాడ అను వైద్యశాల వైద్యులు ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన వ్యాధులు, జనరల్ మెడిసిన్, పిల్లల మరియు ప్రసూతి సంబంధించిన వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free medical camp

You cannot copy content of this page

Scroll to Top