Collector Distributed Pensions : అమ్మా ఇదిగో మీ పింఛన్ ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

అరకులోయ ఫిబ్రవరి 1, (త్రినేత్రంన్యూస్) : అమ్మా బాగున్నారా ఇదిగో మీ పింఛన్ అంటూ జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ స్వయంగా పింఛన్లను వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు చేరవేశారు. మడగడ గ్రామపంచాయతీ పరిధిలోని బెంజిపూర్ గ్రామంలో ఈ ప్రత్యేక కార్యక్రమం శనివారం జరిగింది.
కలెక్టర్ దినేష్ కుమార్ వృద్ధులు, అవ్వలు, తాతల బాగోగులను అడిగి, వారి సమస్యలను వినగా, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఫిబ్రవరి 1 ఆదివారం సెలవు రోజు కావడంతో, సామాజిక పింఛన్ల పంపిణీని ఒక రోజు ముందే నిర్వహించడం జరిగింది అని
జిల్లా కలెక్టర్ వివరించి జిల్లావ్యాప్తంగా వివిధ రకాల సామాజిక పింఛన్ల కింద 74,295 మందికి ప్రతీ నెలా రూ. 31.38 కోట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే పింఛన్ అందే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, దీనివల్ల వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, ఉద్యానశాఖ అధికారి, పంచాయతీ సెక్రటరీ, ఎఎంసీ చైర్మన్ లక్ష్మీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector, who distributed pensions by going door-to-door

You cannot copy content of this page

Scroll to Top