జూలై 23, 2026
TRINETHRAM NEWS
Money Money TPF Funds Trust

Money Money TPF : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ సిటీలో మనీ మనీ అని ఎంతో మంది తమ పొట్ట చేత పట్టుకొని ఎన్నో ఆశలతో ఏదోకటి సాధిద్దాం అని కలలతో హైదరాబాద్ మహానగరం లో అడుగు పెడతారు అలా వచ్చిన వాళ్ళు సాధించిన వాళ్ళు ఉన్నారు సాధించలేని వారు ఉన్నారు, కొంతమంది మాత్రం ఆశ కు పోయి రాత్రికి రాత్రి ఏదోకటి సాధించాలని తప్పుడు మార్గాలని ఎంచుకుంటున్నారు అలాంటిదే ఒకటి ఇప్పుడు చెప్పే దాని గురించి వింటే నిజమేనా అనిపిస్తుంది అయితే అది ఏంటి అంటే టీపీఫ్ ఫండ్స్ సింపుల్ గా చెబితే ఏంటి అంటే ఎవరి దగ్గరైన నూట ముప్పై కోట్లు ఉంటే అది కంపెనీలకి ఇస్తే ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో కంపెనీలకి మరియు డొనేషన్ మోడ్ లో ట్రస్ట్ లకి ముడు వందల యాభై కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంట
అసలు టీపీఫ్ అంటే ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ దీనికి సంబందించిన వ్యక్తులు హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున తిరుగుతున్నారు 1:3 రేషియో అని దీనికి బ్రోకర్లకి(మీడియా) కి పెద్ద ఎత్తున ఇస్తారు అని ఎంతో మంది లైఫ్ సెటిల్ అవుద్ది అని ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని, అలాగే కొంతమంది ఇందులో చేరి చీటింగ్ చేసి సంపాదిస్తున్నారని సమాచారం, ఏది ఏమైనా వీటికి ఆజ్యం పోస్తున్న కంపెనీలు మరియు ట్రస్ట్ లను వెతికి వాటి పైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వీటి గురుంచి తెలిసిన వాళ్ళు ఊళ్ళు వదిలి, రాష్ట్రాలు వదిలి వస్తున్నారు, కంపెనీ ఏజెంట్లమని కొందరు, ట్రస్ట్ అథారిటీ పర్సన్స్ అని కొందరు, ఫండర్ కీ పర్సన్స్ అని కొందరు వీరి అందరికి అడ్డా హైదరాబాద్ సిటీ లోని మాల్స్ మరియు స్టార్ హోటల్స్ ఇంత పెద్ద దందా జరుగుతుంటే మన వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేరు, నూట ముప్పై కోట్లు పెడితే మూడు వందల యాభై కోట్లు ట్రస్ట్ అకౌంట్ కి కంపెనీ ట్రాన్సక్షన్ చేస్తాడంట అందులో యాభై కోట్లు మధ్యావర్థులకి అని సమాచారం, దీని గురించి మా టీమ్ కొంతమంది దీని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం పూర్తి విషయాలు సేకరించి తగిన ఆధారాలతో మీ ముందుకు వస్తాము త్వరలో….,….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page