జూలై 16, 2026

WhatsApp Image 2024 02 11 at 20.43.46

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే పేద‌లు, రైతులు గుర్తుకొస్తార‌ని అన్నారు. బీజేపీ రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుపొందుతుంద‌న్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు, మీ సేవ‌కుడిగా తాను ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని మోదీ చ‌ప్పారు. తాను లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార శంఖారావం పూరించేందుకే వ‌చ్చాన‌ని కొంద‌రు మాట్లాడుకుంటున్నార‌ని.. కానీ తాను ఓట్ల కోసం రాలేద‌ని మోదీ చెప్పారు.

You cannot copy content of this page