WhatsApp Image 2023 12 27 at 6.29.39 PM
వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు వల, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ
అమరావతి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ ) ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారంనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు..
తన అనుచరులతో కలిసి వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్‌సీపీకి జనసేన ఎర్త్ పెడుతుంది. 2024 ఏప్రిల్ మాసంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ఉమ్మడి విశాఖ పట్టణం జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. గతంలో తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీలలో పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు కూడ జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు..
