అవకాశవాదీ ఎమ్మెల్యే వేగుళ్ళ
మేడిపండు నైజం ఆయనది…
అహంకార మదం…
బహిరంగ చర్చ కు అపుడు ఇపుడు సిద్ధమే…
మీడియా ద్వారా చర్చ కు ఒకే….
తేదీ ఖరారు చేయండి…
సెటిల్మెంట్ లు చేశా…
ఎన్నో సమస్యలు పరిష్కరించా…
వంతేనలే పూర్తి చేయలేదు…
సెంటు భూమి ఇవ్వలేదు…
ఇంకేం అభివృద్ధి చేశారు…?
ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్..
Trinethram News : మండపేట ప్లాష్ న్యూస్: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కేవలం… అవకాశవాదీ మాత్రమే అని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడిపండు నైజం ఆయనదనీ వ్యాఖ్యానించారు. బహిరంగ చర్చ కు అపుడు ఇపుడు తను సిద్ధమేనని సవాల్ చేశారు.మీడియా ద్వారా చర్చ కు ఒకే చెప్పారు.
తేదీ ఖరారు చేయలాని పేర్కొన్నారు. తను సెటిల్మెంట్ లు చేశానని గతంలో చెప్పానని ఇపుడు అదే చెబుతున్నానని స్పష్టం చేశారు. ఇలా ఎన్నో సమస్యలు పరిష్కరించానని చెప్పారు. మండపేట లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంజూరు అయిన వంతెనలు కూడా పూర్తి చేయలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. నియోజక వర్గంలో ఒక్క సెంటు భూమి ఇవ్వలేదన్నారు. ఇంకేం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. కేవలం అధికార అహంకార మదం తో వేగుళ్ళ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సౌమ్యుడు అని చెప్పుకొనే వేగుళ్ళ ఎస్ సి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కాంట్రాక్టర్ ను బెదిరించి పనులు అపలేదా అని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని కౌన్సిల్ లో తమ పార్టీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ప్రశ్నిస్తే తానే నిర్మాణం ఆపినట్లు గర్వం తో సమాధానం చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. గొల్లపుంత వైఎస్అర్ నగర్ లో వైఎస్ పేరిట ఆర్చి నిర్మాణం చేసే కాంట్రాక్టర్ ను బెదిరించి పని అపలేదా అని ప్రశ్నించారు.దీనిపై తను స్వయం గా కౌన్సిల్ లో ప్రశ్నిస్తే తానే ఆపినట్లు అధికార మదం తో వేగుళ్ళ సమాధానమిచ్చారని ఇదెక్కడి నైజమని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే జోగేశ్వరరావు సామెతలు చెప్పారని నేరుగా సమాధానం చెప్పకుండా సిగ్గు బిడియం లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాను ఈక్కడ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పని చేయలేదని పేర్కొన్నారు. బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చాలా విషయాలు మాట్లాడవలసి వస్తుందని చెప్పారు. 2004 నుండి 2009 వరకు ఇక్కడ డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి అధికారంలో ఉన్నారన్నారు. 2009లో ఎమ్మెల్యే వేగుళ్ళ ఎన్నికయ్యారని ఆ కాలంలో జరిగిన అభివృద్ధిపై డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి వివరాలు ఇస్తారని చెప్పరు. దానికి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను 2021లో ఇక్కడ ఇన్చార్జిగా నియమితులయ్యానన్నారు. తన కాలంలో జరిగిన అభివృద్ధి చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ పేర్కొన్నారు. అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే ఎమ్మెల్యే రామచంద్రపురం వెళ్లి అభివృద్ధి అంటే ఏమిటో అడగాలని హితువు పలికారు.
గెలుపు ఓటములు సహజమని దీనికి ఎన్నో కారణాలు ఉంటాయన్నారు. తానేదో పెద్దగా సాధించినట్లు వేగుళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014, అక్కడనుండి 2019 వరకు చర్చించాలన్నారు. 2021 లో తను వచ్చిన నుండి 2024 వరకు జరిగిన అభివృద్ధి చర్చిద్దామని పేర్కొన్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. తాను చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై మీడియా ద్వారా చర్చ కు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఇన్చార్జిగా ఉన్న కాలంలో వైసిపి అధికారంలో ఉండడంతో ప్రభుత్వ సహకారంతో సమస్యలను పరిష్కరించానని వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వేగుళ్ళ పనిచేశారని నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసారని ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఒక సెంటు భూమైన ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి హయంలో దాదాపు 153 ఎకరాలు సేకరించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. అనంతరం 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ద్వారపూడి వేములపల్లి లతోపాటు మూడు మండలాల్లోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏదైనా మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలని హితువు పలికారు. కళ్ళు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. టిడిపి హయంలో ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకునేవారన్నారు. జగన్ హయాంలో కాలనీలు ఏర్పాటు చేసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమకు దక్కుతుందన్నారు. టిడిపి కేవలం ప్రచారం కోసం పట్టాలిచ్చి పబ్లిసిటీ స్టంట్ చేసిందని విమర్శించారు. 2014 నుంచి 19 వరకు టిడిపి అధికారంలో ఉందని ఆ సమయంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఏం చేశారో చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో సేకరించిన స్థలాల్లో టిడ్కో ఇల్లు నిర్మించారాని వాటి ద్వారా దోచుకున్న విషయం తనకు వేగుళ్ళకు తెలుసన్నారు. టిడ్కో ఏం స్కాం జరిగిందో చర్చలో చెబుతానని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లు లో రావడానికి ఎవరు ఇష్టపడడం లేదని పేర్కొన్నారు. కనీసం మేకు కూడా దిగగొట్టే వీలు లేదని అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను భయపెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నానని ఎమ్మెల్యే ఆరోపించారని దీనికి సమాధానం చెప్తానన్నారు. తాను సెటిల్మెంట్లు చేశానని చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇబ్బంది పడే అంశాన్ని కూడా సెటిల్మెంట్ చేస్తానని కానీ ఈ విషయం ఆయన తనను కోరితే చేసి పెడతానని దీనిని బహిరంగం చేయడం తనకు ఇష్టం లేదని భావ్యం కాదని స్పష్టం చేశారు.
ప్రముఖ ఎముకల వైద్యనిపుణులు డాక్టర్ రాము ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటే తాను అధికారంలో ఉండగా అనుమతులు ఉన్నా లేకపోయినా నిర్మించుకోమని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పై అంతస్తు నిర్మాణానికి వేగుళ్ళ వద్దకు వెళ్లి చెబితే సరే స్లాబ్ వేసుకోమని చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రూ 25 లక్షల మెటీరియల్ తో స్లాబ్ వేసుకుంటున్న సమయంలో తెల్లవారు వేళ అధికారులను పంపించి ఆ స్లాబ్ను పడగొట్టించారా లేదా అంటూ నిలదీశారు. ఇదే విషయంలో డాక్టర్ రాము వేగుళ్ళకు ఫోన్ చేసి తన కష్టాన్ని వివరిస్తే మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారని రాష్ట్రవ్యాప్తంగా కూలగొడుతున్నారని ఇక్కడ అధికారులు తన మాట వినడం లేదని వేగుళ్ళ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఒక సమర్థ నాయకుడికి అసమర్థుడికి తేడా ఈ అంశంలో తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. వేగుళ్ళ మేడిపండు అని ఎద్దేవా చేశారు. చూడడానికి మెరుగ్గా ఉంటుందని పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయని అదే వేగుళ్ళ నైజం అని విమర్శించారు. నియోజకవర్గంలోని రేషన్ డీలర్లను వేధిస్తూ వారితో కాళ్లు పట్టించుకున్న ఘనత వేగుళ్ళకు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే మాటలకు చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. గతంలో ఏడిద రోడ్ లో అనుమతి లేదని భవనం నిర్మిస్తుంటే పోలీసుల సహకారంతో అప్పటి కమీషనర్ కూలగొట్టారన్నారు. తనకు విషయం తెలిసిన అనంతరం అనుమతులు లేకపోయినా నిర్మాణం చేపట్టాలని తాను చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కేవలం అవకాశవాది మాత్రమేనని విమర్శించారు. నాలుగు కోట్ల విలువైన మున్సిపాలిటీకి చెందిన విలువైన వాటర్ వర్క్స్ భూమిని వేగుళ్ల అనుచరుడు అక్రమంగా ఆక్రమిస్తే తనకు ఈ విషయం తెలియదని సంబంధం లేదని ఎమ్మెల్యే పేర్కొనడం ఆయన నైజానికి నిదర్శనమని అన్నారు.
ఈ పట్టణంలో తానే అనేక సెటిల్మెంట్లు చేశానని అవన్నీ బాధితులకు న్యాయం చేసేందుకు సంబంధించినవేనని పేర్కొన్నారు. 2004లో మండపేట పెద్దకాలపై వైయస్ హయాంలో వంతెన నిర్మాణం అనుమతులు వస్తే ఎప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. పేదలకు విద్యా వైద్యం అందాలనే లక్ష్యంతో వైఎస్ ప్రభుత్వం కృషి చేసిందని దానిని జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం కేవలం దోచుకునేందుకు అని విమర్శించారు. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేయాలనే ఉద్దేశంతోనే పిపిపి విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పోతంశెట్టి ప్రసాద్, నియోజకవర్గ వైసిపి ఆర్టిఐ ప్రెసిడెంట్ మందపల్లి రవికుమార్, వైసీపీ జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, జిల్లా వైసీపీ యువజన విభాగం కార్యదర్శి పోతంశెట్టి
సత్యనారాయణ రెడ్డి నియోజకవర్గ బూత్ కన్వీనర్ పోతుల రాంబాబు, తేతలీ


