- బలభద్రపురంలో అంగరంగ వైభవంగా తృతీయ బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ధ్వజారోహణం, అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం
- శ్రీవిష్వక్సేణ వాహనం సేనాధిపతిగా స్వామి అవతారం
- రెండవ రోజు శేష వాహనంపై స్వామివారి వైభవ విహారం
- పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, దంపతులు
త్రినేత్రం న్యూస్ డిసెంబర్, 16 : బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి తృతీయ బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తుల జయజయధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, అంకురార్పణం వంటి వేదోక్త కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల తొలి రోజు స్వామివారు శ్రీవిష్వక్సేణ వాహనం సేనధిపతిగా స్వామి అవతారం భక్తులకు దివ్య దర్శనమిచ్చి కటాక్షించారు.
సోమవారం రెండవ రోజు స్వామివారికి విశేష పూజలు, మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారు శేష వాహనంపై శ్రీ పరావాసుదేవ అవతారంలో ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. అడుగడుగునా భక్తులు నీరాజనాలు, హారతులతో స్వామివారికి సేవలు అందించగా, గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక శోభతో నింపాయి.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన స్వామివారి వాహన సేవలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


