Kolikapudi Srinivasa Rao : సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 27/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తన క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఓ పత్రికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి ఏమీ తెలియకుండా నోటికి వచ్చింది రాసి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నటువంటి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం మందగించింది అని లోపల పేజీలలో పూర్తిగా తగ్గింది అని రాయడం ఏంటి?
ప్రశ్నించారు. ఒక విషయం మీద పూర్తి అవగాహన లేకుండా ప్రజలను మోసం చేస్తూ మాట్లాడకుండా, అసెంబ్లీకి రావాలి అని వచ్చి ప్రశ్నించమని మీరు అడిగే ప్రతి ప్రశ్నకు తమ దగ్గర తమ సమాధానం ఉంది అని, చర్చకు రమ్మంటే ఆ పెద్దలతో మాట్లాడి వాళ్లని అయినా సరే, నేనైనా సరే మీరు చెప్పిన స్థలానికి వచ్చి సమాధానం ఇస్తామని ఆవేశంలో చెప్పడం జరిగింది. అప్పుల ఆంధ్ర ప్రదేశ్ అంటూ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన లక్షలాది అప్పులను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చిందని మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండి అభివృద్ధి , పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుంటే ఇక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారని, చేసిన అప్పులు, విధ్వంస పాలన నచ్చకే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని మాట్లాడడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who held the

You cannot copy content of this page

Scroll to Top