Songa Roshan Kumar : సిమెంటు రహదారి నిర్మాణం, అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 17/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, చక్రదేవరపల్లి, శ్రీనివాసపురం లో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సిమెంటు రహదారి నిర్మాణం మరియు, అంగన్వాడి భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది , సచివాలయం సిబ్బంది, ఉమ్మడి కూటమి నాయకులు , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను శాసనసభ్యుల కు వివరించగా తక్షణమే స్పందించారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కులము, మతము, భాష, పార్టీ భేదం లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs inaugurated the construction

You cannot copy content of this page

Scroll to Top