మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాబోయే 2027 గోదావరి పుష్కరాల సంధర్బంగా మండపేట నియోజకవర్గం నకు సంబంధించి దేవాలయాల అభివృద్ది పనులపై ప్రతిపాదనలు తయారుచేసి, ప్రభుత్వానికి పంపించుటకు గాను ఎండోమెంట్స్ అధికారులతో మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్ధానాలలో చేపట్టాల్సి పలు అభివృద్ది పనులపై అధికారులతో చర్చించి ప్రతిపాదనలు తయారు చెయ్యవలసినదిగా తెలిపియున్నారు. దీనిపై గోదావరి నదికి 5 కిలోమీటర్లు లోపు ఉన్న దేవాలయాలకు అంచనాలు తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే వీటితో పాటు గోదావరి నదికి 5 కిలోమీటర్లు పరిధిలో లేని దేవాలయాలలో శిధిలావస్ధకు చేరుకున్న దేవాలయాలు ఏమైనా ఉంటే వాటికి కూడా అంచనాలు తయారు చెయ్యాలని, తద్వారా ప్రభుత్వం నుండి నిధులు మంజూరుకు కృషిచేస్తానని అన్నారు. అదేవిధంగా ఎక్కడైన దేవాలయం నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 30 శాతం కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం వార్కి చెల్లిస్తే ప్రభుత్వమే ఆ దేవాలయం నిర్మాణానికి నిధులు మంజూరు చెయ్యటం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమీషనర్ వి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ బాలాజి రామ్ ప్రసాద్, డి.ఇ ఉదయ్ కుమార్, డిప్యూటి స్ధపతి శ్రీనివాసాచార్యులు, ఆయా దేవాలయాల ఇ.ఒ లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


