Jakkampudi Jayanti : మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, జయంతి సందర్భంగా పేదలకు సహాయ కార్యక్రమం

TRINETHRAM NEWS

అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో సేవా కార్యక్రమం నిర్వహణ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మాజీ మంత్రివర్యులు, కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు, జయంతిని పురస్కరించుకుని, ఈ రోజు ఉదయం పెదపూడి ఏరియా ఆసుపత్రి నందు పేదలకు బ్రెడ్, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమం అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జక్కంపూడి రామ్మోహన్ రావు, ప్రజల పట్ల చూపిన సేవా దృక్పథం, సామాజిక నిబద్ధత ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నల్లమిల్లి విజయ్ రెడ్డి, సంపర మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అద్దంకి ముక్తేశ్వరావు,పెదపూడి మండల కన్వీనర్ గుత్తుల వెంకట రమణ, అనపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి,జడ్పీటీసీ సభ్యురాలు పేపకాయల వెంకట లక్ష్మీ,ఎంపీపీ సభ్యురాలు కేతా తులసి శ్రీనివాస్,రాష్ట్ర ప్రచార కమిటీ మండా రాజా రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ వెంకట రెడ్డి,మామిడాడ కన్వీనర్ తాతా రెడ్డి,వైస్ ఎంపీపీ కరెడ్ల వెంకన్న బాబు, పెద్దాడ సర్పంచ్ డోకుబుర్ర కృష్ణ మీనాక్షి,గండ్రేడు సర్పంచ్ కూడుపూడి మాధవీ లత శ్రీనివాస్,పెదపూడి ఎంపీటీసీ సభ్యులు సమ్మంగి దుర్గా ప్రసాద్,పైన ఎంపీటీసీ సుందరపల్లి సుధాకర్,కరకుదురు కన్వీనర్ గోవింద రాజులు,గంగుమాళ్ల సుబ్రమణ్యం,కైకవోలు పండు, మార్ని కామరాజు,గార్లపాటి అశోక్,జానకి రామ్,నర్ల శ్రీను,కాకర సాయి బాబు,పంపన రమణ, మార్ని వెంకట్రావు, దుర్గా ప్రసాద్, యేసు,సుధాకర్,సత్తిబాబు, గాజంగి వీరబాబు, జి.త్రిమూర్తులు,తాళ్లూరి శ్రీను, దేవా,రాంబాబు తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jakkampudi Rammohan Rao, Jayanti,

You cannot copy content of this page

Scroll to Top