త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, శ్రీకాకుళం మండలం, అరసవిల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్ధానం ను శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సందర్శించారు. తొలుత ఆలయ పండితులు, అధికారులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే వేగుళ్ళ కు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ స్వామి వార్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్ధప్రసాదాలు ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సంధర్బంగా ఆలయ ఇ.ఒ ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రామకృష్ణ చౌదరి, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


