త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం
పేదల కలల సాకారం వైపు ఇందిరమ్మ ప్రభుత్వం పయనం…
రైతుల సంక్షేమానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది
తేదీ 20- 06- 2025 న రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఖమ్మం ఎంపీ శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్ , పీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మరియు పలు శాఖల ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లు హైలెవెల్ వంతెనలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా సీతాయిగూడెం వెంగళరావు ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ములకలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసారు. రామాంజనేయపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మరియు చింతలపాడు రూ .21000000, అన్నారం రూ. 16000000 పాతురు రూ. 16000000 గ్రామాలలో మంజూరైన హై లెవెల్ వంతెనలకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి,ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అనుబంధ సంఘ నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


