త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, నియోజకవర్గాల పునర్విభజన కొరకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సభ్యులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, గురువారం అమరావతిలో కలిసారు. ఈ సంధర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని సబ్ కమిటీ సభ్యులైన నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, పి.నారాయణ, కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీనిపై వారంతా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


