తేదీ : 07/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, మండలం, పట్టణంలో ముప్ఫై ఒకటి వ వార్డుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జూలూరు కృష్ణ. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వాళ్ల కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది.
వంద రూపాయలు సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును పొందడం గొప్ప విశేషమని ప్రజలు అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుండి ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు, మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి , విద్యా మరియు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ప్రమాద బీమా చెక్కును అందిస్తున్నామని మంత్రి అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


