“Best Worker” Certificates : ఉత్తమ కార్యకర్త” ప్రశంసా పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశంపార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “సుపరిపాలన-తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా అత్యంత కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లను గుర్తించి తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అభినందిస్తూ “ఉత్తమ కార్యకర్త” ప్రశంసా పత్రాలను విడుదల చేయడం జరిగింది.

ఈ సంధర్భంగా ఆదివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఈ “ఉత్తమ కార్యకర్త” ప్రశంసా పత్రాలను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పంపిణీ చేశారు. అలాగే మండలాల వారిగా “ఉత్తమ కార్యకర్త” లతో ఎమ్మెల్యే వేగుళ్ళ ఫోటో కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాట్లాడుతూ దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీల్లో లేనివిధంగా టిడిపి లో క్రియాశీలక కార్యకర్తలకు గుర్తింపు ఎల్లప్పుడూ వుంటుందని అన్నారు. మండపేట నియోజకవర్గం టీడీపీ కి కంచు కోటగా ఉందంటే ఇక్కడ కష్టపడి పనిచేసే కార్యకర్తలే దీనికి కారణం అని ఎమ్మెల్యే వేగుళ్ళ అన్నారు. తెలుగుదేశంపార్టీ ఎల్లప్పూడు కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ మండల, పట్టణ, గ్రామ, వార్డు నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు, అభిమానులు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla distributed the “Best Worker” certificates

You cannot copy content of this page

Scroll to Top